Mar 07,2023 21:47

ప్రతిభ కనపర్చిన విద్యార్థినులు

కదిరి టౌన్‌ : కర్నాటక రాష్ట్రంలోని కిట్టూరు రాణి చెన్నమ్మ సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో స్థానిక కెఎల్‌ఎన్‌ ఇన్యుస్ట్యూట్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు నవోదయ కోచింగ్‌ ఇన్యుస్ట్యూట్‌ డైరెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ సోమవారం విడుదలైన సైనిక్‌ స్కూల్‌ ఫలితాల్లో తమ ఇన్యుస్ట్యూట్‌ కు చెందిన 19 మంది విద్యార్థులు పరీక్ష రాశారని. అందులో 17 మంది విద్యార్థులు సీట్లు సాధించారన్నారు. వర్షిత, లాస్య ప్రియ, చైత్ర, కుందన శ్రీ, చిన్మయి, కార్తీక, సాయి ప్రణతి, నవనీత, దీప్తిజ్ఞా, హర్షిని, తేజశ్రీ, హేమ శ్రీ, మోగ, తదితర విద్యార్థులు టాప్‌ మెరిట్‌లో సీట్లు సాధించారని రమేష్‌ తెలిపారు. ఇంతటి విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు.