Jan 03,2023 21:29

మాట్లాడుతున్న కెవిపిఎస్‌ నాయకులు

మాట్లాడుతున్న కెవిపిఎస్‌ నాయకులు
సావిత్రిబాయి ఫూలే 126వ జయంతి
నెల్లూరు:చదువుల తల్లి సామాజిక ఉద్యమకారిణి, సావిత్రిబాయి పూలే 126వ జయంతి సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ గత 150 సంవత్సరముల క్రితమే కుల వివక్ష, లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేకించి మహిళల కోసం పాఠశాలలను స్థాపించి చదువు నేర్పించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. స్త్రీ పురుషులు కుల మతాలకతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కుని తెలిపినటువంటి సామాజిక ఉద్యమకారిణి అయిన సావిత్రిబాయి పూలే ని నేటి యువత ఆదర్శంగా తీసుకొవాలన్నారు. ఆ విధంగా చేసిన నాడే ఆమె ఆశయాలను కొనసాగించిన వారవుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఎన్‌ రఘురామయ్య, రాష్ట్ర నాయకులు జి సుధీర్‌, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ఎస్‌ సుదర్శన్‌, లా విద్యార్థులు జి వైష్ణవి, ఎస్‌ కే షాజీర్‌ నాస్తిక సంఘం నాయకులు రా చపాలెం రఘు తదితరులు పాల్గొన్నారు.