కడప అర్బన్ : జెవివి శాస్త్రీయ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎంఎల్‌సి డాక్టర్ గేయానంద్ అన్నారు. ఈ ఏడాది యుఎన్‌ఒ మిల్లెట్ ఏడాదిగా ప్రకటించిందని చెప్పారు. ఆదివారం జయరాజ్ గార్డన్‌లో రాష్ట్ర చెకుముకి సైన్స్ సంబరాలు ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఇలాంటి సైన్స్ సంబరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు మరింత భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. జెవివి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా శాస్త్రీయ ఆలోచన విధానాలపై జెవివి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు కడపలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 టీముల నుంచి 150 మంది విద్యార్థులు భాగస్వాములయ్యారని తెలిపారు. మూఢనమ్మకాల నుంచి ప్రజలను దూరం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు సైన్స్ కార్యకర్తలు 110 మంది, సైంటిస్టులు, ప్రొఫెసర్లు 30 మంది, జీవీవీ కార్యకర్తలు 70 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పారు. మొద టిరోజు రాష్ట్ర నుంచి వచ్చిన విద్యార్థులకు క్విజ్ పోటీలు, విజువల్ రౌండ్స్, మీట్ ద సైంటిస్ట్, సాంస్కతి కార్యక్రమాలు, రెండవ రోజు రాత పరీక్ష, రౌండ్ నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి బి. వెంకటసుబ్బయ్య, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శ్రీనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి కుర్ర రామారావు, నాయకులు రామారావు, త్రిమూర్తులు, ఎ.డి.దేవదత్తం, కె.శ్రీనివాసులు, సరస్వతి, మాదాల రాము, జిలానిబాష, జిల్లా నాయకులు వెంకటసుబ్బయ్య, పద్మావతి, రంగనాయకులు, మురళీగుప్తా, సమీర్ బాష, సుబ్రహ్మణ్యం, యువ నాయకులు డేవిడ్, మహేష్, దాతలు డాక్టర్ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, నారాయణరెడ్డి, బాల ఎల్లారెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, కడప, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేష్‌బాబు, ప్రకాశ్‌రెడ్డి, సమతా కన్వీనర్ సరస్వతి, పద్మావతి, కామేశ్వరమ్మ, తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాధ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










