Jan 21,2023 20:46

సైన్స్‌ సబరాల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు

కడప అర్బన్‌ : ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దక్పథంతో ఆలోచించి అభివద్ధి చెందాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ, జెవివి నాయకులు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శనివారం జనవిజ్ఞాన వేదిక 35 ఏళ్ల చరిత్రలో మొదటిసారి రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు నగరంలోని జయరాజు గార్డెన్స్‌లో నిర్వహించారు. జాతీయ జెండాను పట్టభద్రుల ఎమ్మెల్సీ, జెవివి నాయకులు లక్ష్మణరావు, జెవివి జెండాను పూర్వ నిట్‌ వరంగల్‌ ప్రొఫెసర్‌, జెవివి నాయకులు రామచంద్రయ్య ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు. 20 జిల్లాల నుంచి 41 టీములు, 150 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైంటిస్టులు హాజరయ్యారు. ప్రారంభ సమావేశానికి జెవివిరాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్‌ రాహుల్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి లక్ష్మణరావు మాట్లాడుతూ వందల సంవత్సరాలు గడిచి పోవుతున్నా ఇప్పటికి ఏ జంతువూ మాట్లాడలేదు, కేవలం మనిషి మాత్రమే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అంటే మనిషి మెదడు మాత్రమే అభివద్ధి చెందిందని, ఇంకా అభివద్ధి అవుతుందని తెలిపారు. క్రమంలో శాస్త్రీయ దక్పథంతో ఆలోచించడం, పాటించడం, అభివద్ధి చేసుకోవడం వంటివి చేయాలని పేర్కొన్నారు. హరప్పా, మెహంజోరా లాంటి నాగరికతలు వాటి అభివద్ధి గురించి వివరించారు. పిల్లల్లో సైంటిఫిక్‌ టెంపర్‌ పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక 30 సంవత్సరాలుగా చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తోందని చెప్పారు. నిట్‌ మాజీ ప్రొఫెసర్‌ రామచంద్రయ్య మాట్లాడుతూ రామన్‌ ఎఫెక్ట్‌ కనుగొన్న సి.వి.రామన్‌, సైన్స్‌ దినోత్సవం గురించి, నోబుల్‌ బహుమతి గురించి పిల్లలకు వివరించారు. పరమాణువులు, కణాలు, ప్రోటాన్ల గురించి, క్లిక్క్‌ కెమిస్ట్రీ గురించి వివరించారు. గ్రహణాలొస్తే బయటకు రావద్దు, ఏపని చేయవద్దు, గుడులు మూసేయాలనే మూఢనమ్మకాలు పెంచి పోషించే పాలకులు ఉండడందురదష్టమన్నారు.సైన్స్‌ పట్ల సజనాత్మకతను పెంపొందించుటకే చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
మరో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కోయ వెంకటేశ్వర్లు (తెలంగాణ జెవివి అధ్యక్షులు) మాట్లాడుతూ దేవుడు అనే భావన, పుట్టుక గురించి వివరించారు. సి.వి. రామన్‌ ఒక సారి పడవ ప్రయాణం చేస్తూ సముద్రం నీరు ఎందుకు నీలం రంగులో ఉందని ప్రశ్నించుకున్నాడు , పరిశోధించారు, ప్రశ్నకు సమాధానం కనుగొని నోబుల్‌ ప్రైజ్‌ పొందారని వివరించారు. షార్‌ డిజిఎం బాలమురళీ మాట్లాడుతూ పిల్లలలో స్పేస్‌ గురించి అవగాహన కలిగించడం కోసం అనేక పరికరాలు తెచ్చి ఎగ్జిబిషన్‌ పెట్టామని విద్యార్థులు ఉపయోగించుకుని విషయావగహన పొందాలన్నారు. జెవివి రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్‌ రాహుల్‌ జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో జెవివి నాయకులు డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు రఘునాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు, కెఎంఎంఆర్‌ ప్రసాద్‌, కుర్రా రామరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాల బయన్న, వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర చెకుముకి సైన్స్‌ సంబరాల కార్యదర్శి బాలు, వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.డి.దేవదత్తం, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరామరాజు, సమతా రాష్ట్ర కమిటీ సభ్యులు సరస్వతి, జిల్లా సమతా కన్వీనర్‌ పద్మావతి, కార్యదర్శులు సమీర్‌ బాషా, రంగనాయకులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాశరెడ్డి, కోశాధికారి ప్రతాప్‌ రెడ్డి, జెవివి యూత్‌ నాయకులు డేవిడ్‌, రాజశేఖర్‌, అల్తాఫ్‌ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సైన్సు ప్రదర్శన
షార్‌ నుంచి వచ్చిన సైన్స్‌ బస్సును సైంటిస్టులు రిబ్బన్‌ కటింగ్‌ చేసి ప్రారంభించారు. పల్లవి, జ్ఞానేశ్వరి ఏర్పాటు చేసిన న్యాచురల్‌ వేస్ట్‌ మానేజ్‌ మెంట్‌ స్టాల్‌, శ్రీనివాస్‌ రెడ్డి చే ఏర్పాటు చేసిన సైన్స్‌ స్టాల్‌, బుక్‌ ఎగ్జిబిషన్‌ మరికొన్ని స్టాల్స్‌ను పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం సైన్స్‌ క్విజ్‌, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు.