Mar 22,2022 00:14

మాట్లాడుతున్న పిఎస్‌. రాధాకృస్ణ

ప్రజాశక్తి-గూడూరు: గూడూరు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికుల ఉద్యోగాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌ రాధాకృష్ణ అన్నారు. సోమవారం సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం ఉద్యోగులు,కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. కార్మిక చట్టాల్లో 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చిందన్నారు. దీంతో కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కార్మికుల చట్టాలలో మార్పుతో కార్మికుల తమ హక్కులను కోల్పోతున్నారన్నారు. అదేవిధంగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని ప్రైవేట్‌ వరం చేసి కార్పొరేట్‌ చేతులలో పెట్టిందన్నారు. బిజెపి ప్రభుత్వం నుండి దేశంలో ఉన్న ఉద్యోగ కార్మిక ప్రజల రక్షణకు ఈనెల 28,29 తేదీల్లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. గూడూరు మండలంలోని ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నానరు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ కార్యదర్శి జి.మోహన్‌, మద్దిలేటి , రామాంజనేయులు, మధు, గోపి, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు శేషమ్మ, ఆదిలక్ష్మి కళావతి పాల్గొన్నారు.