సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : ఎఐటియుసి, సిఐటియు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : దేశవ్యాప్తంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగబోయే సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మిక కర్షక ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని మంగళవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఎస్. రాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి శంకరమ్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కార్మిక వర్గంపై కత్తి దాడి చేస్తుందని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రజలు నిర్మించుకున్న కోటానుకోట్ల విలువజేసే ప్రభుత్వ రంగాన్ని విశాఖ స్టీల్‌తో సహా బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేలు, విమానాలు, రక్షణ ఉత్పత్తులు, విద్యుత్ స్థాయిలో బొగ్గు ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఈ సమ్మె మన కార్మిక హక్కుల రక్షణకు సంబంధించిన అంశంగా భావించి కార్మికులు ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొనాలని తెలిపారు. సమ్మెలో కార్మిక, కర్షక, ఉద్యోగ- ఉపా ధ్యాయులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ సిపిఎం ఏరియా కార్యదర్శులు పి మహేష్, రవికుమార్, ఎం శివరామకష్ణ దేవరా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటయ్య, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి సికిందర్ సిఐటియు నాయకులు నరసింహ, వెంకటేష్ పాల్గొన్నారు.










