ప్రజాశక్తి - భీమవరం
దేశ సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను సంరక్షించుకోవడానికి ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సైకిల్‌యాత్రను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడారు. అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీసం కార్మిక చట్టాలు అమలు జరగడం లేదని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చేసి కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నారన్నారు. కార్మికుల నష్టం చేసే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం దారుణమని విమర్శించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను చివరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని, భావితరాలకు ఉపాధి లేని పరిస్థితి కల్పిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిప్పికొట్టాలని కోరారు. ప్రభుత్వరంగాన్ని, జాతి సంపదను కాపాడుకుందాం నినాదంతో జరుగుతున్న సమ్మెలో పెద్దఎత్తున కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో సిఐటియు నాయకులు ఎం.రామాంజనేయులు, డి.నాగు, కె.కృష్ణ, నేల అప్పన్న, ఎస్.శిరీష, సోమేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.
పాలకోడేరు:ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు డెల్టా జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్ పిలుపునిచ్చారు. వేండ్ర డెల్టా పేపర్ మిల్లు కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరం వద్ద సమ్మెకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజానీకం, అన్ని తరగతుల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమ్మెను విజయవంతం చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు మూర్తి, అశ్రీయ, టి.సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు రామకృష్ణ, ఆంజనేయరాజు, కార్మికులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం:బిజెపి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాలు మోపుతుందని సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గురువారం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచేస్తోందన్నారు. కరోనా వల్ల సరైన ఉపాధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి సమయంలో బిజెపి భారాలు వెయ్యడం సరైన విధానం కాద న్నారు. తక్షణం గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, గంగాభవాని, కుమారి పాల్గొన్నారు.
ఆచంట : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు వైట్ల ఉషారాణి వద్దిపర్తి అంజిబాబు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద సమ్మె వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉన్నమట్ల దుర్గాప్రసాద్, అంగన్‌వాడీ కార్మికులు సుజాత, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, శ్రీదేవి, మహాలక్ష్మి పాల్గొన్నారు.
కామవరపుకోట : దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సోమయ్య కోరారు. సిఐటియు ప్రచారయాత్రలో భాగంగా గురువారం స్థానిక కొత్తూరులోని మదర్ థెరిస్సా ఆటో యూనియన్ సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎ.శ్యామల, రాణి, కె.విజయలక్ష్మి, ఎ.జాన్‌బాబు, కె.మల్లేశ్వరరావు, ఉషారాణి, వెంకటరమణ, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యడం ద్వారా కార్మికవర్గం సత్తా చాటాలని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్ పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సార్వత్రిక సమ్మెలో అన్ని తరగతుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు మండల కమిటీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో దీనా స్వరూప రాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, కండెల్లి సోమరాజు, ఆమంచి సత్యనారాయణ, పురెళ్ళ కృష్ణ, శ్యామ్‌ప్రసాద్, సుమలత కుమారి, కుమారి పాల్గొన్నారు.
టి.నరసాపురం : సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పని ప్రదేశాల్లో నిర్వహిస్తున్న ప్రచార యాత్ర మండలంలో పర్యటించింది. ఈ సందర్బంగా టి.నరసాపురం అంబేద్కర్ సెంటర్లో యత్రనుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడారు. ఈ యాత్రలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.శ్యామలారాణి, కె.విజయలక్ష్మి, రైతు సంఘం నాయకులు మురళీ పాల్గొన్నారు.
చింతలపూడి : సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన ప్రచార యాత్ర చింతలపూడి చేరింది. ఈ యాత్రకు సిఐటియు నాయకులు, వివిధ సంఘాల కార్మికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎ.రాణి, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్‌డి.జప్రుల్లా, సిఐటియు మండల అధ్యక్షులు నత్తా వెంకటేశ్వరరావు, సూర్యకుమార్, సువర్ణ రాజు, సరోజిని, నాగరాజు, సలీం, నాగమణి, బాలరాజు పాల్గొన్నారు.
నల్లజర్ల : దేశావ్యాప్త సమ్మెలో కుల, మత, పార్టీలకతీతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొక్కిరపాటి వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని పలు ప్రయివేట్ సంస్థలకు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందజేశారు. దూబచర్లలోని శ్రీసంఘమిత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఛైర్మన్ అంబటి శ్రీనివాస్‌కు సమ్మె నోటీసు అందించారు.
కొవ్వూరు రూరల్ : హమాలీ, ముఠా, జట్టుతో సహా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు కొవ్వూరు కమిటీ కార్యదర్శి ఎం.సుందర్ బాబు డిమాండ్ చేశారు. స్థానిక అల్లూరి విగ్రహం సెంటర్‌లో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కె.కనకారావు, సభ్యులు కె.వీరబాబు, ఎస్.శేషగిరి, కె.హనుమంతు, పి.జగన్నాథం పాల్గొన్నారు.
అత్తిలి : సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అత్తిలిలో ఈ ర్యాలీని సిపిఎం నేత కేతా గోపాలన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు వి.శ్రీనివాస్, వి.వెంకటలక్ష్మి, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, విఆర్‌ఎల సంఘం ఉపాధ్యక్షులు పండు, వ్యవసాయ సంఘ నాయకులు వనం రాంబాబు, రైతు సంఘం నాయకులు మల్ల సూర్యనారాయణ, గ్యాస్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమేష్, బొంతు సత్యనారాయణ పాల్గొన్నారు.










