ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని కార్మికవర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్లో సిఐటియు జిల్లా ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి జెండా ఊపి ప్రారంభించారు. సిఐటియు మండల కార్యదర్శి సుభాషిణి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ప్రసాద్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు దొచిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన టెలికం, బీమా, రైల్వే, బ్యాంకింగ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి లేబర్ కోడ్‌లుగా మార్చి, అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె.విజయలక్ష్మి, ఎ.రాణి, సిఐటియు మండల నాయకులు, శిరోమణి మున్సిపల్ వర్కర్స్ బాలరాజు, వినోద్, లక్ష్మణరావు, స్వామి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు గౌరీ, శిరోమణి, రాజేశ్వరి పాల్గొన్నారు.
భీమడోలు : సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.లింగరాజు పిలుపునిచ్చారు. పాతూరు లోని పౌరసరఫరాల సంస్థ గోదాముల వద్ద సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సమ్మె గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు భీమడోలు మండల కార్యదర్శి వై.సాల్మన్‌రాజు, గోదాముల యూనియన్ నాయకులు రాంబాబు, గడ్డి సూర్యారావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఉండి : మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు డెల్టా జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్, సిఐటియు డెల్టా జిల్లా కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు పిలుపునిచ్చారు. సోమవారం ఉండి మెయిన్ సెంటర్‌లో సమ్మెపై విస్తృత ప్రచారం నిర్వహించే ఆక్వాజాతాను రారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎంతో కాలం పోరాడి సాధించిన 44 రకాల చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా, యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా మార్చిందని విమర్శించారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, దానివలన ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ధనికొండ శ్రీనివాస్, జిల్లా ఆక్వా పరిశ్రమల వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుండాబత్తుల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అల్లూరి అరుణ్, భీమవరం ఏరియా ఆక్వా అనుబంధ పరిశ్రమల వెహికల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ బాషా, సిఐటియు మండల నాయకులు రామకూరు వెంకటరత్నం పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. అధిక ధరలు తగ్గించాలని, లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, ప్రయివేటీకరణ విధానాలు ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్ లతో జరిగే సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రచారయాత్ర జంగారెడ్డిగూడెంలో ప్రారంభించి జీలుగుమిల్లి, కుక్కునూరు వేలేరుపాడు మీదుగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొండలరావు, నాయకులు మంగమురుగు రాజు, అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి, లక్ష్మి, సుభాషిని, సరళ, జ్యోతి, రమ, నాగమణి పాల్గొన్నారు.
పాలకోడేరు : సమ్మెకు సహకరించాలని పాలకోడేరు పిహెచ్‌సి వైద్యాధికారి సిహెచ్.రంగనాయకునికి మండల ఆశ వర్కర్లు, సిఐటియు నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు కళ్యాణి మాట్లాడారు. ఆశా వర్కర్లు అనేక సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాగే సామాన్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజానీకం సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టబోయే సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు ఎస్.లారెన్స్ కుమారి, ఎం.తరంగిణి, రాధిక, వెంకటరమణ, యశోద పాల్గొన్నారు.
ఆకివీడు : దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్ పిలుపునిచ్చారు. యూనియన్ మండల అధ్యక్షులు వెంకట అప్పారావు అధ్యక్షతన స్థానిక గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నాయకులు కె.తవిటినాయుడు, గొర్ల రామకృష్ణ, ధనికొండ శ్రీనివాస్, ఎ.అరుణ్, నక్కాని సత్యనారాయణ, సందక సూరిబాబు, గౌరి నాయుడు, హరీష్ పాల్గొన్నారు.
పెనుగొండ : దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు పాల్గొనాలని కోరుతూ గ్రామ సచివాలయాలకు సమ్మె నోటీసులు అందించినట్లు సిఐటియు మండల కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు మాదాసు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేలేరుపాడు : దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యాన ప్రచార యాత్ర చేపట్టారు. ఈ యాత్ర జంగారెడ్డిగూడెంలో ప్రారంభించి జీలుగుమిల్లి, కుక్కునూరు మీదుగా సోమవారం వేలేరుపాడు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మడివి దుర్గారావు అధ్యక్షతన వేలేరుపాడులోని ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ సెంటర్లో సభ నిర్వహించారు. యాత్ర రథసారధి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు విజయలక్ష్మి, రాణి, సుభాషిణి, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు లత, బోగారి వెంకటేశ్వర్లు, మండల నాయకులు నరసమ్మ, శైలజ, నయోమి, ముత్తమ్మ సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్, నాయకులు కొత్త వెంకటేశ్వర్లు, కూసం రాంబాబు, నాగేంద్రబాబు, ఐశ్వర్య పాల్గొన్నారు.










