Mar 22,2022 15:44

విజయవాడ : మనువాద మతోన్మాద ఆర్ఎస్ఎస్బి-జెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక, పారిశ్రామిక, ఉద్యోగ సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 28, 29న తలపెట్టిన " జాతీయ సార్వత్రిక సమ్మె , గ్రామీణ హర్తాళ్ " కు దళిత, గిరిజన ప్రజాసంఘాలు మద్దతుగా "ప్రభుత్వ రంగ సంస్థలను, రిజర్వేషన్లు  కాపాడుకుందామని" కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో 23.03.2022 బుధవారం ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, జగజ్జీవన్ ఐక్యతా భవన్, లెనిన్ సెంటర్, విజయవాడలో నిర్వహిస్తున్నట్లు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి  అండ్ర మాల్యాద్రి పత్రికా ప్రకటనలో తెలిపారు.