రాయదుర్గం (అనంతపురం) : సార్వత్రిక సమ్మెకు మద్దతుగా... శనివారం ఉదయం రాయదుర్గంలోని ప్రధాన రహదారుల్లో ఎల్‌ఐసి ఉద్యోగులు, సిఐటియు నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎల్‌ఐసి పాలసీల ప్రీమియంపై జిఎస్‌టి ని ప్రభుత్వం ఎత్తివేయాలని, సమస్యలన్నిటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










