Mar 26,2022 11:56

ఓబులదేవరచెరువు (అనంతపురం) : ఈ నెల 28, 29 తేదీలలో జరగబోతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిస్తూ ఓబులదేవరచెరువులో శనివారం నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మండల కార్యదర్శి శ్రీరాములు, కుల్లాయప్ప, నాయకులు చాంద్‌ బాషా, షబ్బీర్‌, కెవిపిఎస్‌ వెంకటేష్‌, ముబారక్‌, బాబా ఫక్రుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.