షార్ట్‌ఫిలిం పోస్టర్లు విడుదల చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - గోరంట్ల : గోరంట్ల పట్టణానికి చెందిన జిఎం సురేష్ నేతృత్వంలో చేపట్టిన టార్చ్ బేరర్ అనే షార్ట్ ఫిలిం రిలీజ్‌కు సంబందించిన పోస్టర్లను కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు జిఎం శేఖర్ విడుదల చేశారు ఈ సందర్భంగా నిర్మాత జిజిఎం సురేష్ మాట్లాడుతూ జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిస్తున్న టార్చ్ బేరర్ షార్ట్ ఫిలింలో రూపొందించిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. తమ షార్ట్‌ఫిలింను ఆదరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దర్శకులు సందీప్ చౌహన్, కెమెరా ఎడిటింగ్ ప్రదీప్, మ్యూజిక్ డైరెక్టర్ అంజి, నటీనటులు బాషా, నాగేంద్ర, హరీష్, భగవాన్ శ్రీనాథ్, నరేష్, గంగాధర్, వెంకటాచలం, మేదర శ్రీనివాసులు, యతీష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.










