Jan 13,2023 22:20

ఫొటో : మాట్లాడుతున్న కోవూరు సెబ్‌ సిఐ నరహరి

సారారహిత గ్రామంగా మూర్తిరాజుపురం
ప్రజాశక్తి-అల్లూరు : సారా రహిత గ్రామంగా మూర్తిరాజపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని కోవూరు సెబ్‌ సిఐ నరహరి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సింగపేట పంచాయతీ పరిధిలోని మూర్తిరాజుపురం గ్రామంలో మాదక ద్రవ్యాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడి శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు ఎఇఎస్‌ కృష్ణ కిషోర్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత మే నుండి ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలియజేశారు.
గతంలో విరివిగా సారాయి తయారు చేస్తున్న క్రమంలో పలుమార్లు దాడులు చేసి బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వివరించారు. తిప్ప తరహాలో ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పించాలని గ్రామస్తులు కోరగా సంబంధిత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో పొదుపు మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, శ్రీధర్‌, కానిస్టేబుల్లు మస్తాన్‌, పౌలు, రాజు పాల్గొన్నారు.