Mar 07,2023 21:11

మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి -నెల్లూరు :క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా నగర వ్యాప్తంగా చేపడుతున్న డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అంది స్తున్నామని, యూజర్‌ చార్జీల చెల్లింపుతో నగరాభివద్ధికి ప్రజలంతా సహకరించేలా అవగాహన పెంచాలని శానిటేషన్‌ సిబ్బందిని కమిషనర్‌ హరిత ఆదేశించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగం పురోగతిపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమి షనర్‌ చెన్నుడు, ఆరోగ్య శాఖాధి కారి డాక్టర్‌ వెంకట రమణ, శానిటరీ సూపర్‌ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.