పుట్టపర్తి రూరల్ : జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైతుందని అనంతపురం రేంజ్ డిఐజి రవి ప్రకాష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ ఎఆర్ విభాగాన్ని తనిఖీ చేశారు. అనంతరం పుట్టపర్తి పరేడ్ మైదానంలో ఎఆర్ సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తో కలసి పరేడ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ పోలీసులు ఎప్పుడూ ప్రతికూల పరిస్థితుల్లో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనీ, అప్పుడే ప్రజలు హర్షిస్తారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ బాగా ఉన్నప్పుడే అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. పరేడ్ లో మంచి ప్రతిభ కనపరిచిన జిల్లా పోలీస్ వాయిద్య బృందానికి డిఐజి నగదు రివార్డు అందజేశారు. జిల్లా ఏఆర్ విభాగం తనిఖీచేసి పలు సూచనలు చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కాన్ఫరెన్స్ హాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, ఎఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్‌ఐలు శ్రీశైలరెడ్డి, టైటాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న డిఐజి రవిప్రకాష్










