సాంస్కృతికోద్యమం విస్తృతం చేయాలి : కేరళ సాహిత్య అకాడమీ కార్యదర్శి సచిదానందన్
- ప్రజా సంస్కృతిపై దాడిని ఎదుర్కోవాలి
- మోడీ ప్రభుత్వం మూఢత్వాన్ని ప్రోత్సహిస్తోంది
సిహెచ్ కనరన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : సమాజ మార్పులో సాంస్కృతికోద్యమం కీలక పాత్ర పోషిస్తోందని, దానిని అంతటా విస్తృతంగా చేపట్టాలని కేేరళ సాహిత్య అకాడమీ కార్యదర్శి సచిదానందన్ పేర్కొన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వం మూఢత్వాన్ని ప్రోత్సహిస్తోందని, శాస్త్రీయ భావాలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. 23వ సిపిఎం అఖిల భారత మహాసభ సందర్భంగా కన్నూర్‌లోని సిహెచ్ కనరన్ నగర్ (టౌన్ స్వ్యేర్)లో సంస్క ృతిపై సదస్సు జరిగింది. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సచిదానందన్ మాట్లాడుతూ ... సమాజ మార్పులో సాంస్క ృతిక పోరాటం చాలా కీలకమని అన్నారు. ప్రజల సంస్క ృతిని దెబ్బ తీసి, ప్రజల అస్తిత్వంపై, భిన్నత్వంపై దాడికి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజా సంస్క ృతిపై దాడిని ఎదుర్కొనేందుకు అభ్యుదయ, హేతువాదులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపు ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో నడుస్తోన్న మోడీ సర్కార్ పాఠ్యాంశాల్లో మార్పులకు ఒడిగట్టిందని, ఆధిపత్య సంస్క ృతిని జప్పించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. మతోన్మాదాన్ని పెంచిపోషించే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుందని విమర్శించారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. హిందూత్వని వ్యతిరేకించి, అభ్యుదయ, హేతువాదాన్ని వ్యాప్తి చేసినందుకే గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గి, దబోల్కర్, గౌరీ లంకేష్ వంటి వారిని హత్య చేశారని అన్నారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని పోరాటాల వెనకా సాంస్కృతిక ఉద్యమం కీలక భూమిక పోషించందని గుర్తు చేశారు. దేశంలో అనేక మంది చాలా త్యాగాలు చేశారని, సంస్కరణోద్యమాలు నడిపారని చెప్పారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రత్యేకత భిన్నత్వంపై దాడికి పూనుకుంటున్నారని విమర్శించారు. 'ఏం తినాలి, ఏ బట్ట కట్టుకోవాలి, ఎవరితో మాట్లాడాలి' వంటి అంశాలను వారే నిర్ణయించే దుస్సాహసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సిపిఎం ఎంపి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎస్ వెంకటేశన్ మాట్లాడుతూ సాహిత్యం, సాహితీ వేత్తలపై జరుగుతున్న దాడి, దేశ సాంస్కృతిక తిరోగమనాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు. సాహిత్యమనేది ఉద్యమానికి గుండెకాయ వంటిదని పేర్కొన్నారు. సాహిత్యంపై దాడిని ప్రజా ఉద్యమంపై దాడిగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముకేష్, సాహితీ వేత్త ప్రభవర్మ తదితరులు పాల్గొన్నారు.










