Jul 30,2022 22:35
సాంకేతిక మార్పులను వాల్యూయర్స్‌ తెలుసుకోవాలి

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
సాంకేతికపరంగా వస్తున్న మార్పులను వాల్యూయర్స్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వాల్యూర్స్‌ (ఐవోవి) విజయవాడ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్‌ వద్ద గల ఒక హౌటల్‌లో ' లేటెస్ట్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ వాల్యూషన్‌ ' అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. తొలుత సదస్సును ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎస్‌బిఐ డిజిఎం కె.రంగరాజన్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిఎం ఎన్‌.శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకింగ్‌ రంగంలో వస్తున్న మార్పులు తెలుసుకోవడంతో పాటు వాల్యూయర్స్‌ కొత్త కొత్త విషయాలను ఎప్పటికపుడు తెలుసుకోవాలన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వాల్యూయర్స్‌ జాతీయ అధ్యక్షులు పి.కె.త్యాగరాజన్‌ మాట్లాడుతూ సాంకేతికపరంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో వచ్చిన మార్పులను తెలుసుకోవడంతో పాటు రుణాలు లెక్క కట్టే సమయంలో సమర్థవంతంగా వాల్యూయర్స్‌ వ్యవహరిం చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వాల్యూయర్స్‌ విజయవాడ ఛాప్టర్‌ చైర్మన్‌ పేర్ల మురళీకృష్ణ, జనరల్‌ సెక్రటరీ పి.మధన్‌ మోహన్‌, వైస్‌ చైర్మన్‌ ఎస్‌.శ్రీనివాసరాజు, ఆర్‌.వెంకట సత్య, ట్రెజరర్‌ పి.సింగయ్య, జాయింట్‌ సెక్రటరీ మూర్తిబాబు, సీనియర్‌ వాల్యూయర్స్‌ పాల్గొన్నారు.