May 06,2023 22:02

ఫొటో : పథకాలను గూర్చి వివరిస్తున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

సామాన్యుడి సంక్షేమమే సిఎం లక్ష్యం
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లంపాడు సచివాలయం పరిధిలోని సన్నువారిపల్లి, ఖాదర్‌పూర్‌ గ్రామాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సంక్షేమ లబ్ధి కరపత్రాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయనకు పలు సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. పింఛను, రైతు భరోసా, పక్కాగృహాలకు సంబంధించి కొందరు లబ్ధిదారులు ఆయనకు తెలియజేయడంతో వెంటనే ఆయా అధికారులు సమస్యలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమస్యలు తెలుపుతుంటే ప్రతి నమోదు చేసుకుని పరిష్కరించి మళ్లీ వాళ్లకు తెలియచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ప్రతిఒక్కరూ ఆ విధంగా పనిచేయాలని సూచించారు.
సచివాలయంలో ఫిర్యాదు అందిన వెంటనే నిర్ణీత వ్యవధిలో సమస్యను పరిష్కరించేలా మండలస్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలన్నారు. గ్రామంలో బోరు మంజూరు చేయాలని కోరడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సన్నువారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను ఆయన ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, అధికారులతో కలసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఖాదర్‌ పూర్‌ ఎస్‌సి కాలనీలో పర్యటించిన ఎంఎల్‌ఎకు స్థానికులు వాటర్‌ ప్లాంట్‌ కావాలని విన్నవించారు. స్పందించిన ఆయన ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయిస్తామని వారికి హామీనిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులు నాయుడు జెసిఎస్‌ మండల కన్వీనర్‌ మోహన్‌ రెడ్డి, ఎంపిటిసి అబ్దుల్లా, సర్పంచ్‌ కృష్ణారెడ్డి, అల్లంపాడు సచివాలయం కన్వీనర్‌ ఎస్‌ కే మౌలాలి, మాజీ మండలాధ్యక్షుడు కోనంకి శ్రీనివాసులు నాయుడు, బోదవాడ చిన్న మాచనూరు, ఏపిలికుంట, సర్పంచులు హరిబాబు నరసింహారావు, నారాయణరెడ్డి, నాయకులు ప్రతాపరెడ్డి, రామకృష్ణారెడ్డి, మీరావలి, లక్ష్మీరెడ్డి, రసం రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి, రవీంద్రబాబు, శేఖర్‌ రెడ్డి, అన్నవరపు నారాయణరెడ్డి, ఒంగోలు బాలకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, మాజీ ఎంపిటిసి ఓబుల్‌ రెడ్డి, పలు శాఖల అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.