విజయవాడ : బండిని బయటకు తీయాలంటేనే సామాన్యుడి గుండె గుభేలుమంటోంది. ఎందుకంటే ఇంధన ధరలు తారాస్థాయిలో మండిపోతున్నాయి. ఓ వైపు కరోనా దెబ్బనుండి నిదానంగా కోలుకుంటుంటే.. మరోవైపు పెట్రోలు బాదుడు దంచికొడుతోంది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర వంద మార్క్ దాటింది. తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల చొప్పున చమురు సంస్థలు రేట్లను పెంచాయి.
న్యూఢిల్లీతో సహా దేశమంతా పెట్రోల్ లీటర్ ధర రూ.100.56 కి చేరింది. ముంబయిలోనైతే రూ.106.59, కోల్‌కతాలో లీటరు రూ.100.62, చెన్నైలో లీటరు పెట్రోలు రూ.101.45 కు చేరింది.
విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.107.07 ఉండగా, డీజిల్ ధర రూ.99.60 గా ఉంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.106.64 ఉండగా, డీజిల్ ధర రూ.99.15గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.86 ఉండగా, డీజిల్ ధర రూ.97.96కి చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ. 105.37 ఉండగా, డీజిల్ ధర రూ.98.42 ఉంది.










