Mar 17,2023 22:15

సామాజిక సేవా కార్యకర్తలతో ఎడిజె శైలజ

ప్రజాశక్తి-హిందూపురం : సామాజిక సేవా కార్యకర్తలు సామాజిక సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ సామాజిక కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం స్థానిక అదనపు న్యాయ స్థానంలో అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ చైర్మన్‌ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతపై సామాజిక సేవా సంఘాలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ మాట్లాడుతు హిందుపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచార దాడులను సామాజిక సేవకులు సమాజంలో చైతన్య పరిచి ఆపడానికి ప్రయత్నం చేయాలన్నారు. న్యాయ సేవా సంస్థలు సహాయ సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నగారా, టిప్పు సుల్తాన్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షులు ఉమర్‌ ఫారూక్‌ ఖాన్‌, వృక్షరక్షకుడు భాస్కర్‌ రెడ్డి, వృద్దాశ్రమం నాగిరెడ్డి, చేనేత సామాజిక సేవకులు ఎసి. నాగరాజు, యునైటెడ్‌ సిఖ్‌ మోహిందర్‌ జీత్‌ సింగ్‌, పల్వీందర్‌ సింగ్‌, మౌలానా షాబుద్దీన్‌, అన్సార్‌ మజీద్‌ ముతవల్లీ ఖలీల్‌, సెల్‌ పాయింట్‌ నూరూల్లా, న్యాయవాదులు కళావతి, నవీరా, లోక్‌ అదాలాత్‌ శారద, హేమావతి తదితరులు పాల్గొన్నారు.