ప్రజాశక్తి-వన్‌టౌన్
దేశ ప్రజలకు సామాజిక భద్రత అందించడంలో ఎల్‌ఐసి విశేషమైన కషి చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జిల్లా సైన్స్ అధికారి ఎం హుస్సేన్ కొనియాడారు. కరోనా మహమ్మారితో దేశంలో మరణించిన లక్షలాది కుటుంబాలను ఎల్‌ఐసి ఆదుకుందని ఆయన అన్నారు. స్థానిక భవానిపురం ఎల్‌ఐసి నగర శాఖ 2 ఆధ్వర్యంలో బీమా 66వ వారోత్సవాల ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ దేశ ప్రజల నమ్మకాన్ని పొంది ప్రజా సంక్షేమానికి నిధులు అందిస్తున్న ఎల్‌ఐసి వంటి సంస్థలు ప్రతిభకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు విద్యార్థులు పట్టుదలతో ఓపికతో కషి చేస్తే వారు ఎంచుకున్న రంగాలలో ఎదుగుతారని వివరించారు..ఈ సందర్భంగా వక్తత్వ పోటీలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి ఆర్ ప్రియాంక (డి.ఎస్.ఎం) ద్వితీయ బహుమతి బి.నాగ మోహన్ (జి.ఎన్.ఆర్),తతీయ బహుమతి ఎం.ప్రశాంతి( ఎస్ డి ఎం వై ఆర్ ఆర్) స్కూల్స్ విద్యార్థులు సాధించారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు కె. మురళీకష్ణ, ఆర్. నరసింహం ,ఎస్.పి.వి.ఎన్ మల్లి కార్జున్, స్థాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










