Oct 20,2023 10:44

ముంబయి : రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగుతుంది. తాజాగా రూపాయి 5 పైసలు క్షీణించి 83.18 వద్దకు చేరుకుంది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావంతో విదేశీ నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రూపాయి మారకం విలువ శుక్రవారం క్షీణించింది. ప్రతికూల ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ మరియు బలమైన డాలర్ కూడా భారతీయ కరెన్సీపై ప్రభావం చూపాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.