Apr 13,2023 11:39

ప్రజాశక్తి-పీలేరు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో ఉదయం, సాయంకాలం ఒక గంట పాటు  యోగ సాధనకు అవకాశం కల్పించాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్  మందపాటి శేషగిరి రావుకు యోగా టీచర్స్ వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం యోగ మాస్టర్లు డాక్టర్ పివిఎస్ లక్ష్మి, డాక్టర్ రాయల సుధాకర్ రాయలు ఆధ్వర్యంలో యోగ టీచర్లు ఆయన్ను తిరుపతిలో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 గ్రంథాలయాలున్నాయని, అందులో ఉదయం, సాయంకాలం పాఠకులకు, స్థానిక ప్రజలకు యోగ విద్యను అందించేందుకు యోగా టీచర్లకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్లు ముని, మంజుల, వరదరాజులు, లోకేష్, అమర్నాథ్, చంద్రశేఖర్ తదితర యోగ టీచర్లు పాల్గొన్నారు.