కేరళ : సిపిఎం 23వ అఖిల భారత మహాసభల ముగింపు అనంతరం కన్నూర్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ కోసం ముందుగానే యువతీయువకులు, పెద్దలు, పిల్లలు రోడ్లపైకి వచ్చి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ మహమ్మారిలో ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని అందించడంలో సిపిఎం నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల మన్ననలు పొందింది. ప్రజల కోసం నిరంతరం కృషిచేసే పార్టీకి ప్రజాదరణ ఈ విధంగా వెల్లడవుతుంది.














