ప్రజాశక్తి - పుల్లంపేట : రీజియన్ పరిధిలో రూ.వంద కోట్ల అభివృద్ధిని సాధించామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ అన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్‌భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు పథకాల గురించి డిజిటల్ లావాదేవీల ప్రాముఖ్యత గురించి సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎలా అవగాహనతో ఉండాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ రుణ పథకాల గురించి వ్యవసాయ అనుబంధ రుణాల ఆవశ్యకత గురించి పెన్షన్, ఇన్సూరెన్స్ పథకాల గురించి గ్రామీణ బ్యాంక్ సేవల గురించి మొదలైన వాటి గురించి వివరించారు. పుల్లంపేట గ్రామీణ బ్యాంక్ శాఖ రూ.100 కోట్ల వ్యవసాయ వద్ధి సాధించి మన రీజియన్‌లోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఖాతాదారులకు వివిధ రకాల సేవలు అందించడంలో ప్రధాన స్థానంలో ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాజాత వారు నిర్వహించిన వీధి నాటకంలో బ్యాంకు పథకాల గురించి లఘు నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. బ్రాంచ్ మేనేజర్ మూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ బ్యాంకు నందు డిపాజిట్లపై అత్యధికంగా 7.60 శాతం వడ్డీ ఇస్తున్నామని గహ రుణాలపై తక్కువ వడ్డీ ఇస్తున్నామని తెలియజేశారు. అర్హులైన ఖాతాదారులకు రుణ సౌకర్యం కల్పించడం, తమ బ్యాంకు ఎల్లవేళలా ఖాతాదారుల క్షేమమే మా బ్యాంకు దేయం అని మేనేజర్ తెలియజేశారు. ఖాతాదారులే మా దేవుళ్ళు అని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ శేషుబాబు, విజరు కుమార్, శశికళ, జగ్గు బాబు పాల్గొన్నారు.










