'రూటా' క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : రియాసతి ఉర్థూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హమీద్ అధ్యక్షతన ఆత్మకూరు పట్టణంలోని అభిరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్ రెడ్డి ఉర్థూ బాషాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ హాస్పిటల్ ఆవరణంలో సన్మానం చేశారు. ఈ సందర్బంగా రూటా 2023 వార్షిక క్యాలండర్‌ను, స్టిక్కర్‌ను డాక్టర్ శ్రావణ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల విద్యా బలోపేతం కోసం ప్రస్తుత ప్రభుత్వం ఉర్థూ బాషను రెండవ అధికార భాషగా చేసిందని గుర్తుచేశారు. భవిషత్తులో ఉర్థూ భాష సమస్యలు వాటి పరిష్కారాలపై సానుకూల దృక్పథంతో ఉంటానని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ సాదిక్‌హుస్సేన్, రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ షేక్ జావీద్, జిల్లా లెక్చరర్ వింగ్ అధ్యక్షులు షేక్ అహ్మద్ మొహిద్దీన్, రాష్ట్ర అడిషనల్ జెనరల్ సెక్రటరీ షేక్ జిలానీబాషా, జిల్లా ఉపాద్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, షేక్ ఖాదర్‌బాషా, షేక్ షఫీ, ఉర్థూ బాషాభిమానులు పాల్గొన్నారు.










