మాట్లాడుతున్న కమిషనర్
రుణమేళాను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు :జగనన్న కాలనీ లబ్ధిదారులకు గహ రుణాలు అందించేందుకు నిర్వహించిన రుణ మేళా లో నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ పాల్గొన్నారు. స్థానిక వెంకటేశ్వరపురం జగనన్న కాలనీలో బుధవారం నిర్వహించిన రుణ మేళాలో 3,9,13,45 డివిజన్లకు చెందిన సుమారు 150 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రూఫ్ నిర్మాణం పూర్తయిన గహాలకు పొదుపు పథకం ద్వారా మరో 35 వేల రూపాయల రుణాన్ని వడ్డీ లేకుండా అందించనున్నామని, ఆ మొత్తంతో ఫినిషింగ్ పనులను పూర్తి చేసి గహాలను లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా స్థానిక కాలనీ నిర్మాణ సమయం నుంచే ప్రజలకు అందుబాటులో ఉండేలా బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని కమిషనర్ వెల్లడించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గహాలను కేటాయించనున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఈ.ఈ, డి.ఈ, ఏ.ఈలు, మెప్మా విభాగం అధికారులు, సచివాలయం అమెనిటీస్ కార్యదర్శులు పాల్గొన్నారు.










