రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంమిట్టలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పాలకుల అండదండలతో కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుని దుకాణాలను నెలక్పొతున్నారు. ఇన్నీ తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రజాశక్తి-ఒంటిమిట్ట (సిద్ధవటం)
మండలంలో పరిధిలోని కడప-చెన్నై రహదారి ఉప్పరపల్లె గ్రామ సమీపన రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 936లో కొందరు స్థానికు నాయకులు బడా రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమిం చుకుని పట్టణాలకు ధీటుగా షాపింగ్ మాల్స్‌ను నిర్మించుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఉప్పరపల్లిలోని కొందరు బడా వస్త్ర వ్యాపారులు పేదలకు అందాల్సిన ప్రభుత్వ స్థలాలను పక్కాగా ప్రణాళిక రచించి బినామి పేర్లతో కోట్లు విలువజేసే స్థలాల్లో పెద్దపెద్ద భవంతులను నిర్మించుకుని వ్యాపారాలు కొన సాగిస్తున్నారు. అదే ఇళ్లు లేని పేదలు ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని, కాళ్లు అరిగేటట్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరిగినా కని కరించని అధికారులు అదే బడా వ్యాపారవేత్తలు ఆక్రమించుకుంటే పట్టీ పట్టనట్లుగా వ్యవహించడం శోచనీయం. వారికి ఎలాంటి నిబంధనలు వర్తించవు. ఒకొక్కరు సుమారు పది నుంచి 50 సెంట్ల వరకు ఆక్రమించుకుని భవంతులు నిర్మించుకుని వ్యాపారాలు సాగిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. పేదలు నిలువ నీడ లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో పూరిగుడిసెలు నిర్మించుకుంటే కేసు లు పెట్టడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా సంబంధితాధికారులు జోక్యం చేసుకుని కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుని ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.
అధికారులు ఏమన్నారంటే..
ఉప్పరపల్లిలో నిర్మించిన భవంతులపై విచారించి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తహశీల్దార్ శంకర్‌రావు పేర్కొన్నారు. నిబంధనలు విరుద్ధంగా నిర్మించి ఉంటే చట్టరీతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే గ్రామసచివాలయ పంచాయతీ కార్యదర్శికి పూర్తి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశామని ఎంపిడిఒ పులిరామ్‌సింగ్ అన్నారు. భవ నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ అప్రూవల్ అయిందా లేదా, బకాయిలు చెల్లిస్తున్నారా? లేదా అన్ని వివరాలు లిఖిత పూర్వకంగా అందించాలని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ఆదేదేశించామని తెలిపారు.










