Feb 13,2022 07:36
  • గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రానున్న ఆర్థిక సంవత్సరంలో దాదాపు 34 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థికశాఖకు సమర్పించింది. ఇందులో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా కలిపి పేర్కొన్నట్లు సమాచారం. పలు కార్పొరేషన్ల ద్వారా చేసే వ్యయానికి 19,664 కోట్లు కావాలని కోరింది. పెట్టుబడి వ్యయంగా 7,240 కోట్లు, ప్రణాళికేతర వ్యయంగా మరో 2,040 కోట్లుకు ప్రతిపాదించింది. ప్రధానంగా పంచాయితీ రోడ్లకు పలు రకాల నిధులను ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. నబార్డ్‌ అధ్వర్యంలో నిర్మించే రోడ్లకు 85 కోట్లు, పంచాయితీ రోడ్లకు 660 కోట్లు, రోడ్ల పునర్నిర్మాణానికి 100 కోట్లు కావాలని కోరారు. ఆర్‌ అండ్‌ బి భవనాలకు 60 కోట్లు, గ్రామీణాభివృద్ధి నిధికి 60 కోట్లు, ఉపాధిహామీ ద్వారా అమలు చేసే రోడ్ల పనులకు 265 కోట్లు, పంచాయితీ రోడ్ల నిర్వహణకు 1,112 కోట్లు, సున్నా వడ్డీ కిరద 1020 కోట్లు, స్త్రీ నిధి రుణాలకు 30 కోట్లు, అభయహస్తం కోసం 126 కోట్లు, జాతీయ గ్రామీణ లైవ్లీహుడ్‌ మిషన్‌కు 530 కోట్లు, స్వచ్ఛారద్ర కార్పొరేషన్‌ పనులకు 975 కోట్లు కావాలని ప్రతిపాదించారు.
 

                                                              కార్పొరేషన్లకు భారీగా

ఎనిమిది కార్పొరేషన్లకు భారీగా నిధులు కావాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు 3,306 కోట్లు, ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు 1,153 కోట్లు, బిసి సహకార ఆర్ధిక సంస్థకు 9,642 కోట్లు కావాలని ప్రతిపాదించారు. అలాగే కాప్పు కార్పొరేషన్‌కు 1,229 కోట్లు, ఇబిసి సంక్షేమ సంస్థకు 3,523 కోట్లు, మైనార్టీ ఆర్ధిక సంస్థకు 737 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 73 కోట్లు, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌కు కోటి రూపాయలు కావాలంటూ ఆర్ధికశాఖకు ప్రతిపాదించారు.