ప్రజాశక్తి-నందిగామ : నందిగామలో సోమవారం రేషన్ డీలర్లు నందిగామ ఆర్డీవో కార్యాలయం ,తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. జాతీయ దుకాణదారుల సంక్షేమ సంఘం పిలుపుమేరకు నందిగామలో డీలర్లు ధర్నా నిర్వహించారు. నందిగామ
మండల రేషన్ డీలర్లు సంఘం అధ్యక్షుడు అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఒకే విధమైన కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.4.40 రూపాయలు ఇవ్వాలని, మిడ్ డే మీల్స్ బకాయిలు చెల్లించాలని, రేషన్ సరుకుల పంపిణీ డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో, తహశీల్దార్ లకు డీలర్లు వినతిపత్రం అందజేశారు.
మండల డీలర్ల అందరూ కలిసి ర్యాలీగా వెళ్లి నిరసనలు తెలిపారు. ఈకార్యక్రమంలో డీలర్లు మొహమ్మద్ రసూల్, భాష, శ్రీదేవి పలువురు డీలర్లు పాల్గొన్నారు.










