Mar 09,2023 22:13

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశకి - కదిరి అర్బన్‌ : శ్రీమత్‌ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13వ తేదీన నిర్వహించే రథోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను శాసనసభ్యులు డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి గురువారం పరిశీలించారు. తిరువీధులను తిరిగి రథోత్సవానికి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రథోత్సవానికి వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్‌, సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.