Apr 23,2023 21:56

జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి టి. త్యాగరాజు

రాయచోటి : జిల్లాలోని మార్కెటింగ్‌ శాఖలో రైతు బజార్లను అభివృద్ధి చేయడమే తమలక్ష్యమని జిల్లా వ్యవసాయ వాణిజ్య,మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి టి. త్యాగరాజు పేర్కొన్నారు. జిల్లాలో మార్కెట్‌ యార్డులు, రైతు బజార్‌లో వ్యాపారులకు, ప్రజలకు మెరుగైన నాణ్యమైన సరుకులు విక్రయించి ఎలా ఆదాయం పొందాలో ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.
జిల్లాలో రైతు బజార్‌ వివరాలు తెలపండి ?
అన్నమయ్య జిల్లాలోరైతు బజార్‌ను ఏర్పాటు చేసి ఏడాదైంది. రాయచోటిలో ఇటీవల కాలంలో వైయస్సార్‌ రైతు బజారు ఏర్పాటు చేశాం. రైతు బజార్‌లో 53 స్టాల్స్‌ను రైతులకు కేటాయించాం. డ్వాక్రా మహిళా గ్రూపు వారికి చిరుధాన్యాల విక్రయం కోసం డిఆర్‌డిఎ ప్రతిపాదనతో ఒక గదిని కేటాయించాం. రైతు బజార్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. కలెక్టర్‌ గిరీషా, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా ప్రత్యేక చొరవతో వారి సలహాలు, సూచన మేరకు రైతుబజారు అభివద్ధికి కషి చేస్తున్నాం . మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, వ్యవసాయ జిల్లా మార్కెట్‌ సలహా మండలి సభ్యులు దిన్నెపాడు రవిరాజు సహకారంతో రైతు బజార్లు అభివద్ధి బాటలో నడిపించడానికి కషి చేస్తున్నాం .
జిల్లాలో మార్కెటింగ్‌ కమిటీలు ఎన్ని ? వాటి ఆదాయం ఎంత?
జిల్లాలో మార్కెటింగ్‌ కమిటీలు 10 ఉన్నాయి . జిల్లా వ్యాప్తంగా 2022 - 2023 సంవత్సరానికి గాను రూ 889.00 లక్ష్యం కాగా రూ. 648.39 పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా 73 శాతం పూర్తి చేశాం .రాయచోటి యార్డులో 69 శాతం , రాజంపేటలో 55 శాతం , ముల కలచెరువులో 01 శాతం , అంగళ్లులో 89శాతం, వాల్మీకిపురంలో 75 శాతం, కలికిరిలో 105 శాతం , పీలేరులో 42 శాతం , లక్కిరెడ్డిపల్లెలో 118 శాతం, మదనపల్లెలో 62 శాతం, రైల్వే కోడూ రులో 68 శాతం లక్ష్యాన్ని పూర్తిచేశాం. రైతు బజార్‌ విషయానికొస్తే జిల్లాలో ఒకటి మాత్రమే ఉంది. మరొకటి నూత నంగా ప్రారంభించాం. నష్టాలు వసు ్తన్నా యని, వ్యాపారులు చెబుతున్నారు. కనీ సం స్టాల్‌కు రూ.500 చెల్లించాలని కోరు తున్నాం. రైతు బజార్లను ఆదా యం మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తాం.
నూనత రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నారా?
మార్కెట్‌ యార్డులో రైతు బజార్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం . కమిషనర్‌ ఆదేశాల మేరకు పీలేరు, కలికిరిలో ప్రాంతాలలో అనువైన ప్రాంతాలుగా గుర్తించాం. త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. రాయచోటి రైతు బజార్‌లో వాచ్‌మెన్‌ను నియమించాం. భవిష్యత్తులో ఆదాయం వచ్చిన తర్వాత మరింత సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.