Feb 20,2023 21:00

- బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేడా

రాజంపేట అర్బన్‌ : మండల పరిధిలోని అత్తిరాలలో శ్రీ కామాక్షి సహిత త్రేతేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ చైర్మన్‌ వి.వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున్‌రెడ్డి హాజరై టెంకాయను కొట్టి బండలాగుడు పోటిలను ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.