Jan 01,2023 09:09

ధర్నా చేస్తున్న వ్యకాసం నాయకులు

         పెనుకొండ : రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో నెలకొన్న రస్తా వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ వ్యకాసం ఆధ్వర్యంలో శనివారం నాడు పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ మాట్లాడుతూ చెరుకూరు గ్రామానికి సంబంధించిన నందమూరి కాలనీవాసులు అనుభవంలో ఉన్న రస్తాను జెసిబి యంత్రంతో ఓ వ్యక్తి తొలగించి వరి నాట్లు వేస్తున్నాడని తెలిపారు. రస్తాను తొలగిస్తున్న తలారి శీనప్ప, అనితమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత ఐదు రోజుల నుండి వివాదం నడుస్తున్నా సంబంధిత తహశీల్దార్‌ చర్యలు తీసుకోలేదన్నారు. సబ్‌ కలెక్టర్‌ విచారించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌ కె.కార్తీక్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, సోమందేపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప, కాలనీవాసులు మల్లికార్జున, అంజన్నప్ప, కిష్టప్ప, సిద్ధమ్మ, జయమ్మ, శాంతమ్మ, అలివేలమ్మ, హనుమక్క పాల్గొన్నారు.