ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
రానున్న పండుగల సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా నగరంలోని 'ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రఫెల్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు మంజు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో గోల్డ్, డైమండ్స్ ఆభరణాలతో పాటు, ఒక గ్రాము ఆభరణాలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే చీరలు, డిజైనర్ క్లాత్స్, ఫ్యాషన్ యాక్ససరీజ్‌తో పాటు చుడీదార్స్, ఉన్నాయని తెలిపారు. ప్రదర్శనలో సుమారు 60కిపైగా స్టాల్స్ ఉన్నాయని తెలిపారు.










