ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: రోగ నిర్థారణలో ఖచ్చితత్వంతో పాటు, అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అన్ని రకాలైన వైద్య పరీక్షలు ఒకేచోట అందించేందుకు టెనెట్ డయాగస్టిక్స్‌ను విజయవాడ నగరానికి తీసుకువచ్చినట్లు టెనెట్ డయాగస్టిక్స్ సెంటర్ చైర్మన్ దేవినేని సురేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీచరణ్ తెలిపారు. మొగల్‌రాజపురంలోని శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగస్టిక్స్ సెంటర్‌ను ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ కావ్య, డైరెక్టర్ డాక్టర్ విజయేందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తమ వద్ద 3టి ఎంఆర్‌ఐ, సిటి స్కాన్, పిఎఫ్‌టి, లేబరేటరీ సర్వీసెస్, టిఎంటి, బిఎండి డెక్సా, ఇసిజి, ఇఇజి, 2డి ఎకో, మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్, వాక్సినేషన్స్, ఎక్స్‌రే, సేవలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్, వివిధ రకాలైన హెల్త్ ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అన్ని రకాలైన ఆరోగ్య ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విజయవాడలో మొదటిసారిగా డ్యూయల్ ప్రోబ్ ఫైబ్రోస్కాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేడియాలజీ డైరెక్టర్ డాక్టర్ సందీప్ జువ్వాడి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ స్మిత, పాల్గొన్నారు.










