Jan 06,2023 22:09

ఫొటో : మాట్లాడుతున్న డిఎస్‌పి కోటారెడ్డి

రోడ్లపై సమావేశాలు నిషేధం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : నిబంధనల ప్రకారం రాష్ట్రంలో జాతీయ రహదారులపై పట్టణ ప్రధాన రోడ్లపై సభలు సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి అనుమతులు లేవని ఆత్మకూరు డిఎస్‌పి కోటారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులకు లేకుండా సభలో సమావేశాలు పెట్టుకోవాలన్న ముందస్తుగా అనుమతి తీసుకుంటే సమావేశం నిర్వహించే స్థలం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందా లేదా ఆ స్థలంలో ఎంతమంది మహిళలు, పురుషులు, ఎంతమంది హాజరౌతారని పరిశీలిస్తామన్నారు.
ఆ స్థలం సరిపోతుందా లేదా అనేది పరిశీలించి ఆ నిర్వాహకులకు తగు జాగ్రత్తలు ఇస్తూ పర్మిషన్‌ ఇస్తామన్నారు. ఆ పర్మిషన్‌ కూడా జిల్లా ఎస్‌పి అన్ని రకాలుగా పరిశీలించి ఇస్తారని తెలిపారు. ముందుగా స్థానిక ఎస్‌ఐ, సిఐ, డి.ఎస్‌.పి ద్వారా పర్మిషన్‌ అప్లై చేసుకోవాలన్నారు. అక్కడినుండి జిల్లా ఎస్‌పికి పంపుతామన్నారు. అక్కడ పరిశీలించి పర్మిషన్‌ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒ నెంబర్‌ 1 ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శివశంకరరావు ఉన్నారు.