మృతిచెందిన ఫారెస్టు బీట్ అధికారి
రోడ్డు ప్రమాదంలో
ఫారెస్ట్ బీట్ అధికారి దుర్మరణం
సైదాపురం:ఆర్‌టిసి బస్సు బైక్‌ను ఢకొీనడంతో ఫారెస్టు బీట్ అధికారి దుర్మరణం చెందారు. ఈసంఘటన మండలంలోని తుమ్మల తలుపూరు సమీపంలోని రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. సుధాకర్ తలుపూరులో పని చూసుకొని తిరిగి బైక్‌పై వస్తుండగా గూడూరు డిపోకు చెందిన బస్సు ఢ కొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్‌ను చికిత్స నిమిత్తం పొదలకూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. తరలించగా మతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని స్వస్థలం నెల్లూరులోని చెముడుగుంట. సుధాకర్ మతదేహాన్ని జిల్లా అటవీ శాఖాధికారి చంద్రశేఖరరెడ్డి, రేంజర్ మాల్యాద్రి సందర్శించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










