పెనుకొండ : పెనుకొండ మండలం పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందాదు. ఆగి ఉన్న లారీని వెనక నుండి ఇనోవా కారు ఢ కొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబందించి స్థానికులు తెలిపిన వివరాలు... పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన ఓ కుటుంబంతో పాటు వారి బంధువులు కలసి ఒక సుమో, మరో ఇన్నోవాకారులో యల్లనూరు మండలం కొడివాండ్లపల్లికి శుభకార్యం నిమిత్తం బయలు దేరారు. మార్గమధ్యంలో ఇన్నోవా కారు ఆగిఉన్న సిమెంట్‌లారీని ఢకొీంది. ఈ ప్రమాదంలో శ్రీరంగరాజుపల్లికి చెందిన సత్యనారాయణ(50) అతని మామ గౌరీబిదనూరుకు చెందిన నంజుడప్ప(70) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న నాగరత్నమ్మ, శ్రీరాములు, లక్ష్మమ్మ, సౌభాగ్య, అరుణ్, అశ్వర్థప్పకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పెనుకొండ ఎస్‌ఐ రమేష్ బాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే బి.కె. పార్థసారధి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ తదితరులు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.










