వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
పెనుకొండ : పట్టణంలో రోడ్డు ప్రమాదలను నివారించి ప్రజలను కాపాడాలని సిపిఎం నాయకులు కోరారు. ఈసందర్భంగా నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్‌ఐ రమేష్ బాబుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు రమేష్ మాట్లాడుతూ పట్టణంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా కియ పరిశ్రమకు సంబంధించిన బస్సులు అతివేగంగా వస్తున్నాయని దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. కియా బస్సుల అతివేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో కియ పరిశ్రమ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పన్న, బాబావలి, వజ్రం నాగప్ప, రెడ్డప్ప రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.










