Dec 23,2022 21:33

బాధితురాలిని పరామర్శిస్తున్న మాజీమంత్రి పరిటాల సునీత

           ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి   పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందడంతోపాటు మరో 9 మంది గాయపడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మాజీమంత్రి పరిటాల సునీత శుక్రవారం అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాద బాధితులందరూ కూలీ, నాలీ చేసుకుని జీవించేవారన్నారు. అలాంటి వారు మృతిచెందడం, గాయపడటం బాధాకరమన్నారు. వెంటనే మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.