ప్రజాశక్తి-హిందూపురం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి సర్కిల్ వరకు ట్రాఫిక్ నిబంధనలపై ర్యాలీ చేపట్టారు. నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి కరుణసాగర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు అయేషా, గోవర్ధన్‌రెడ్డి, ఎంవిఐలు రమణ, శివశంకర్, ఎఒ జాన్‌పాల్, పట్టణ సిఐ వెంకటేశ్వర్లు, రూరల్ సిఐ వేణుగోపాల్, ప్రయివేటు పాఠశాలల అసోసియోషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, పాంచజన్య, అల్-అమీన్, దీప్తి, ఎల్‌ఆర్‌జి, ఈశ్వర్, వేణు, పాఠశాలల హెచ్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.
తనకల్లు : రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో ఎంవిఐ ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్‌ఐ రామ్‌భూపాల్‌యాదవ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అధిక వేగం తగ్గించి నడుపుకోవాలన్నారు. అంతేగాకుండా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మద్యం త్రాగి వాహనాలు నడపరాదని, వాహనాలకు సంబంధించిన అన్ని రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహన యజమానులు, డ్రైవర్లు, పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు : జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ వరప్రసాద్, ఎస్‌ఐ గోపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రయాణం సాగించాలన్నారు. ఆటోలు తదితర ప్రజా రవాణా వాహనాల్లో పరిమితికి నుంచి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనాల యజమానులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
హిందూపురంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులు










