ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ రోడ్డు ప్రమాదాల నివారణ జరగాలంటే రోడ్డు భద్రత నియమాలు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక గణేష్ సర్కిల్ లో రోడ్డు ప్రమాదాలు, పాటించవలసిన నియమ నిబంధనలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కళాశాలల విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గణేష్ సర్కిల్ నుంచి గోకులం మీదుగా సత్యమ్మ గుడి వరకు 3కెఎం వాక్ దన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డీఎస్పీ ి యశ్వంత్, ఎస్‌పి డిఎస్‌పి ఉమామహేశ్వర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని మోటార్ వాహనాల తనిఖీ అధికారి వరప్రసాద్ కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కదిరి పట్టణంలో కాలేజీ సర్కిల్ ,అంబేద్కర్ సర్కిల్‌లో వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. వాహన చోదకులకు కరపత్రాలు పంపిణీ చేసి రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పోలీసులు, వాహనదారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
హిందూపురం : వాహనాదారులు తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని జిల్లా రవాణ శాఖ అధికారి కరుణ సాగర్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ వీధుల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.. అనంతరం పాఠశాల, క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలను కార్యాలయ ఆవరణంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు అయిషా, గోవర్దన్ రెడ్డి, సిబ్బందితో పాటు ఎంవిఐలు రమణ, శివశంకర్, జయశ్రీ యాదవ్, ఎఒలు జాన్‌పాల్, ఇనాయతుల్లా, ట్రాఫిక్ ఎస్‌ఐ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎంబిఐడిఎస్ ఎం. వరప్రసాద్ కోరారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆటో డ్రైవర్లతో కదిరి ఎంబిఐడిఎస్‌ఎం వరప్రసాద్ ఆటో డ్రైవర్ తో అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు ఎఎస్‌ఐ రమణారెడ్డి రామయ్య, భాస్కర్, రాజు సిబ్బంది, కృష్ణమూర్తి, ఆటో యూనియన్ నాయకులు ఎం నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, తదితరులు










