Apr 22,2023 20:59

ముస్లిం పెద్దలతో నాయకులు

ముస్లిం పెద్దలతో నాయకులు
రంజాన్‌ ప్రత్యేక ప్రార్ధనల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
నెల్లూరు:స్థానిక దర్గామిట్ట బారాషాహీద్‌ దర్గా వద్ద ఈద్గా ప్రాంగణంలో శనివారం పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రంజాన్‌ పర్వదనాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ సందర్భంగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మత సామరస్యానికి ప్రతీక అని ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్‌ పండుగన్నారు.
ఆ అల్లాV్‌ా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి , ముస్లిం మత పెద్దలు, పలువురు కార్పొరేటర్లు, ముస్లిం సోదరులు, ముఖ్య నాయకులు తదితరులు పోల్గొన్నారు.