ప్రజాశక్తి - రాయచోటి : రక్తహీనతను దూరం చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ గిరీష్ ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి అనీమియా టెస్టింగ్, వైద్య సిబ్బంది హాజరు, ఫ్యామిలీ పిజిషియన్, తదితర అంశాలపై డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా ఆస్పత్రుల డాక్టర్‌లతో కలెక్టర్ గిరీష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా ఆస్పత్రి ముఖ ఆధారిత హాజరును పక్కాగా అమలు చేయాలని డాక్టర్లను ఆదేశించారు. ముఖ ఆదారిత హాజరను డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు పర్యవేక్షణ చేయాలన్నారు. గర్భిణులు పరీక్షలు ఖచ్చితంగా చేయాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. దేవపట్ల 45 శాతం, సుండుపల్లి 52 శాతం చేశారని, ఇంప్రూవ్ కావాలని సూచించారు. వచ్చేవారం కల్ల ప్రతి పిహెచ్‌సిలో రెండు హిమోగ్లోబిన్ పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌లో భాగంగా ఆయా సచివాలయాలకు ముందుగానే ఏ గ్రామాలకు వెళ్లే షెడ్యూల్‌ను తెలియజేసి సచివాలయం ద్వారా టామ్ టామ్ వేయించాలన్నారు. ఇంటిదగ్గర డాక్టర్ వెళ్లి వైద్య సేవలు అందిస్తే రోగులల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. జనరల్ ఒపి 19,137, ఫీవర్ 603 కేసులు, తదితర ఒపి చూశారన్నారు. ప్రతి పిహెచ్‌సి నుంచి వెయ్యి ఒపి చూడాలన్నారు. పిటిఎం మెడికల్ ఆఫీసర్ క్యాన్సర్ రోగుల పట్ల మంచి వైద్య సేవలు అందించడంతో అభినందించారు. స్కూల్స్, హౌమ్, అంగన్వాడి కేంద్రాల విజిట్ చేసి డేటా ఎంట్రీ తప్పక చేయాలన్నారు. ఐరిస్క్ వుమెన్ చివరి వరకు వేచి ఉండకుండా ముందుగానే హాస్పిటల్ చేర్పించి మంచి సేవలు అందించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ త్వరగా చేయించాలన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. కోవిడ్ ప్రోటోకాల్ తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, డిఎంహెచ్‌ఒలు, పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా ఆసుపత్రిల డాక్టర్‌లు పాల్గొన్నారు.










