Jan 12,2023 19:57

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ గిరీష, అధికారులు

చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి
ప్రజాశక్తి - రాయచోటి : రక్తహీనత లేని సమాజ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందని చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ జవహర్‌రెడ్డి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హల్‌ నుంచి కలెక్టర్‌హొ గిరీష్‌ పిఎస్‌, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్‌ సెక్రటరీ మాట్లాడుతూ రక్తహీనత లోపం ఉన్న గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టి సారించి వారికి సరైన పోషకాహారం అందించాలన్నారు. గర్భిణులు అనీమియా బారిన పడకుండా ఉండేందుకు పౌష్టికారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా బాలింతలకు, చిన్నపిల్లలు బరువు తక్కువ ఉండడం, చురుకుదనం, ఎదుగుదల లోపం శాతాన్ని తగ్గించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారాన్ని అందించాలని అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని అన్నారు. మనబడి నాడు -నేడు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్లు వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో జగనన్న గోరుముద్ద పక్కాగా అమలయ్యేలా డిఇఒలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పీఎంజేఏవై కార్డుల సంబంధించి ఈకేవైసీ వంద శాతం చేయించాలన్నారు. ఎస్‌డిజి లక్ష్యం, ఆరోగ్యం , స్త్రీ, శిశు సంక్షేమం, ప్రభుత్వ పథకాలు అమలు అంశాల్లో ఎస్‌డిజి సూచికలపై దష్టి పెట్టాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను అభివద్ధి పరచడానికి సుస్థిర సమగ్రాభివద్ధి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివద్ధి లక్ష్యాలను శతశాతం సాధించేందుకు ప్రతి శాఖ తప్పనిసరిగా కషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లల నమోదు పక్కాగా జరగాలన్నారు. పుట్టిన పిల్లలనుంచి ఒక సంవత్సరంలోపు పిల్లల బర్త్‌ రిజిస్ట్రేషన్‌ రికార్డులో నమోదు చేయాలన్నారు. విసిన అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా ఆదర్శంగా ఉండాలని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. బాల్య వివాహాలు జరిగితే, వాటిపై సమగ్ర విచారణ చేయాలన్నారు. ముఖ ఆధారిత హాజరు పక్కాగా అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను గణనీయంగా పెంచాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఈనెలాఖరిలోగా ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యానికి చేరుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగుల ఖాళీలు, రోస్టర్‌ పై తాజా సమాచారాన్ని ఇవ్వాలని విఎస్‌ డబ్ల్యూఎస్‌ ఏఓను ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివద్ధి లక్ష్యాలను శతశాతం సాధించేందుకు ప్రతి శాఖ తప్పనిసరిగా కషి చేయాలన్నారు.