Jan 01,2023 19:37

రక్తదానం చేస్తున్న యువకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: వెల్‌ విషర్స్‌, ఫ్రెండ్స్‌ టూ సపోర్ట్‌ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ రక్త నిధి కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్త నిధి కేంద్ర డాక్టర్‌ అమరావతి మాట్లాడుతూ రక్తదాన శిబిరంతో నూతన సంవత్సరాన్ని ఆరంభించడం శుభ పరిమాణమని తెలిపారు. యువత ప్రతి సందర్భాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వెల్‌ విషర్స్‌ నిర్వాహకులు గిరీష్‌ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన రోగులు దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో రక్తదాతల వివరాలు కలిగిన ఫ్రెండ్స్‌ టూ సపోర్ట్‌ మోబైల్‌ ఆప్‌ మరియు వెబ్‌సైట్‌ని సందర్శించాలని తెలిపారు. ఆసక్తి గల రక్తదాతలు ఈ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. రక్తదాన శిబిరంలో రక్త నిధి కేంద్ర సిబ్బంది, వెల్‌ విషర్స్‌ సభ్యులు విజరు, రెడ్డి శేషు, మురళీకృష్ణ, హరి బాబు, జ్ఞానేంద్ర పాల్గొన్నారు.