ప్రజాశక్తి రూరల్ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి తీరాలని రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డిపేర్కొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా బుధవారం రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే రక్త దానం ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్లు అవుతుందని అత్యవసర సమయాల్లో చాలామందికి అవసరమైన గ్రూపుకు సంబంధించిన రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని యువత దష్టిలో పెట్టుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. రక్తదాన శిబిరంలో సుమారు 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ చెన్నకష్ణ, నోడల్ అధికారి డాక్టర్ శేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటనాగేశ్వరరావు, ఐసిటిసి కౌన్సిలర్ వెంకటసుబ్బయ్య, పిల్లిపిచ్చయ్య పాల్గొన్నారు. బి.కొత్త కోట : పట్టణంలోని ఆదిత్య డిగ్రీ కళా శాలలో లయన్స్‌క్లబ్ ఆఫ్ హార్సిలీహిల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వ హించారు. 63 యూనిట్ల రక్తాన్ని దాతల నుంచి సేకరించారు. కార్య కమంలో సిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ హార్సిలీహిల్స్ సభ్యులు హరినాథ్ రెడ్డి, కష్ణారెడ్డి, వెంకటరెడ్డి, రామచంద్ర రడ్డి, సకల విశ్వనాథ్, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేట : బోయనపల్లిలోని అన్నమా చార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఒకేరోజులో అత్యధికంగా రక్తదానం చేసినందుకు జిల్లా బెస్ట్ ఇన్సిట్యూషన్ అవార్డును అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌ఎంవి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినో త్సవం సందర్భంగా వైఎస్‌ఆర్ కడప రెడ్‌క్రాస్ సంస్థ వారు ఈ అవార్డును ప్రకటించారని ప్రిన్సిపాల్ వెల్లడించారు. అవార్డును ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ ఓబులపతి స్వీకరించారని తెలిపారు. జిల్లా బెస్ట్ ఇన్సిట్యూషన్ అవార్డు అందజేసినందుకు కళాశాల యాజమాన్యం డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ సి.రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ చొప్పాఎల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ చొప్పా అభిషేక్ రెడ్డిలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌ను అభినందించారు.










