Feb 20,2023 21:06

లోగో అందజేస్తున్న బ్యాంక్‌ అధికారి

లోగో అందజేస్తున్న బ్యాంక్‌ అధికారి
రిటైల్‌ మెగా ఎక్స్పో
నెల్లూరు:నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం , రిటైల్‌ అసెట్‌ హబ్‌ కలిసి మెగా రీటైల్‌ లోన్‌ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హ్యుందారు, హెరీండా, మారుతీ, కియా , స్కోడా మొదలైన అన్ని ప్రధాన కంపెనీలకు చెందిన కార్‌ డీలర్లు వారి వాహనాలను ప్రదర్శించారు. కెనరా బ్యాంకు ఖాతాదారుల, ప్రజల సౌకర్యార్థం కెనరా బ్యాంకు అధికారులు అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన డీలర్లతో కలిసి ఒకే ప్రాంతంలో మెగా రిటైల్‌ లోన్‌ ఎక్స్పో నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ ఎక్స్పోను కెనరా బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ శ్రీనివాస్‌ కన్నన్‌ డివిజనల్‌ మేనేజర్‌ రిటైల్‌ అసెట్‌ హబ్‌ ఎల్‌ కష్ణ కుమార్‌ ప్రారంభించారు.
రిటైల్‌ లోన్‌ ఎక్స్పో సందర్భంగా రూ.7.60 కోట్ల రుణాల మంజూరు చేయడమే కాకుండా రూ. 1.45 కోట్ల తక్షణ రుణాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. బ్యాంకు యొక్క వివిధ రుణ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల నుండి భారీ స్పందనతో ఈ కార్యక్రమం విజయవంతమైందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఖాతాదారులు , ప్రజలు ఇటువంటి మేళాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ వీరేంద్ర నాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.