May 31,2023 21:01

రిజిస్ట్రేషన్ చార్జీల ధరవు

జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుదలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నెల రోజుల కిందటి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచనున్నామని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూములు మొదలుకుని మున్సిపాలిటీల్లోని స్థలాలు, ఎన్‌హెచ్‌ జాతీయ రహదా రులను ఆనుకుని ఉన్న స్థలాలు, భూములకు 30 శాతం చొప్పున ధరలు పెరగనుండడం గమనార్హం. గురువారం నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీల ధరలు అమల్లోకి రానుండడం ఆందోళన కలిగిస్తోంది.ప్రజాశక్తి- కడప ప్రతినిధి
కడప, అన్నమయ్య జిల్లాల్లో 12 చొప్పున 24 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యా లయాలు ఉన్నాయి. వీటి పరిధిలోని మున్సిపల్‌ స్థలాలకు, వ్యవసాయ భూము లకు, జాతీయ రహదారి ఆధారిత భూములకు, ఇతర కమర్షియల్‌ స్థలాలకు 30 శాతం చొప్పున ధరలు పెరగను న్నాయి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మల మడుగు, కమలాపురం, యర్రగుంట్ల, పులివెందుల, బద్వేల్‌, రాజంపేట, రైల్వేకో డూరు మున్సిపాలిటీలు, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదన పల్లి, తదితర మున్సిపాలిటీల్లో క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. వీటి పరిధిలోని స్థలాలు, వ్యవసాయ భూములు, ఎన్‌హెచ్‌ ఆధారిత స్థలాలు, భూ ములు పెద్దఎత్తున ఉన్నాయి. కమర్షియల్‌ వ్యవహారం ముడిపడిన నేపథ్యంలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో వందలాది రిజిస్ట్రేషన్ల కార్య కలాపాలు సాగుతున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు కమర్షియల్‌ ప్రాధాన్యత కలిగిన కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని స్థలాలకు, వ్యవసాయ భూములకు, జాతీయ రహదారి ఆధారిత భూములకు, ఇతర కమర్షియల్‌ స్థలాలకు ధరలు పెరగనున్నాయి. ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్ల ఆదాయ సముపార్జనే లక్ష్యాల్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. తాజా రిజిస్ట్రేషన్‌ ఛార్జీల ధరల పెరుగుదల నేపథ్యంలో అటు ప్రజల్లోనూ, ఇటు రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారుల్లో సైతం నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.